Posts

Showing posts from August, 2021

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ఆవిర్భావం...

Image
73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడిన IXవ భాగం లోని 243 ఆర్టికల్ కు అనుగుణంగా దేశమంతటా ఒకే రకమైన పంచాయతీ పాలన ఏర్పాటు చేయబడినది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో కూడా పాత చట్టాల్ని మార్పు చేశారు. ఇంతకుముందు మన రాష్ట్రంలో  ఎ) గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల చట్టం - 1964. బి) మండల జిల్లా పరిషత్తు లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులు మరియు జిల్లా ప్రణాళిక, అభివృద్ధి సమీక్షా మండలాల చట్టం -1986. సి) ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంస్కరణల చట్టం 1989 అమలులో ఉండేవి. 73వ రాజ్యాంగ సవరణ తర్వాత ఈ మూడు చట్టాల స్థానంలో కొత్తగా ఒకే చట్టంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ఆమోదం పొంది 3-5-1994 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టంలో మొత్తం 8 భాగాలలో 278 సెక్షన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం - 1994,  8 భాగములు మరియు 278 సెక్షన్లు...    సేకరణ వ్యాసకర్త : నాయకుల రాజేష్ సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ గుమ్మఘట్ట మండలం రాయదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లా ఫోన్ నంబర్ : 9346314349

మహాత్మా గాంధీ గారి మాటలలో గ్రామ స్వరాజ్యం అంటే ?

Image
గ్రామ స్వరాజ్య స్పూర్తి ప్రదాత జాతిపిత మహాత్మా గాంధీ గారి మాటలలో గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి ?  1. గ్రామం స్వయంపాలన చేసుకుంటూ గణతంత్ర రాజ్యంగా విలసిల్లడం. 2. తన మౌలిక అవసరాలను తానే తీర్చుకుంటూ ఇరుగుపొరుగు గ్రామాలతో ఇచ్చిపుచ్చుకుంటూ, స్వయం సమృద్ధి సాధించి స్వయం ప్రతిపత్తి గల గ్రామంగా తయారుకావడం. గాంధీజీ సూచించిన రక్షా రేకు (తావీదు) :- ఎప్పుడైనా తనకు, తను అనే స్వార్థం ఎక్కువ అయింది అనిపిస్తే ఈ రకంగా చేయాలి " అత్యంత పేదరికం అనుభవిస్తున్న మరియు బలహీనమైన వ్యక్తి ముఖాన్ని గుర్తు చేసుకో, నీవు చేయబోయే లేదా నీవు తీసుకునే నిర్ణయం వల్ల ఆ వ్యక్తికి ఏమైనా ఉపకరిస్తుందా అని ఆలోచించు. దీని వల్ల ఆ నిరుపేద వ్యక్తికి లాభమా? ఈ నిర్ణయం ఆ వ్యక్తి జీవితాన్ని, అతని అదృష్టాన్ని మారుస్తుందా? ఇంకో మాటలో చెప్పాలంటే నీ నిర్ణయం ఆకలితో అలమటిస్తున్న కోట్లాది మంది జీవితాలలో ఆకలి రూపుమాపి ఆధ్యాత్మిక/ ఆత్మ వికాస గ్రామస్వరాజ్యం సాధనకు దారితీస్తుందా?  అలా అయినట్లయితే నీలోని స్వార్థం తనకు తానే మంచులా కరిగి పోయి నీలోని అనుమానాలు పటాపంచలవుతాయి... గ్రామస్వరాజ్యం… మహాత్ముడి స్వప్నం! గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు… గ్ర...

73వ రాజ్యాంగ సవరణ - పంచాయతీ రాజ్ వ్యవస్థ

Image
1993వ సంవత్సరంలో రాజ్యాంగానికి 73వ సవరణ చేయడం ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి లభించింది. తద్వారా రాజ్యాంగంలో పార్ట్ - IX క్రింద ఆర్టికల్ 243 ను పొందుపరిచారు. 1. అధికరణ - 243 :- భారత రాజ్యాంగం 9వ భాగంలో నిర్దేశించిన విధంగా అన్ని రాష్ట్రాలు, మూడంచెల స్థానిక ప్రభుత్వాలను విధిగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు, మధ్యంతర వ్యవస్థలో మండల ప్రజా పరిషత్ లు, జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్ లు.  2. అధికరణ - 243A :- రాష్ట్ర శాసనసభల ద్వార చట్టబద్ధంగా సంక్రమించిన విధులు అధికారాలతో గ్రామసభలు పనిచేస్తాయి. 3. అధికరణ - 243B :- పంచాయతీలను స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించి నిర్వచనం చెప్పబడినది. దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాలలో మూడు స్థాయిలలో (గ్రామ, మండల, జిల్లా) పంచాయతీ రాజ్ మూడంచెల వ్యవస్థ మరియు కొన్ని చిన్న రాష్ట్రాల్లో రెండు స్థాయిలలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటు సేకరణ వ్యాసకర్త : నాయకుల రాజేష్ సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ గుమ్మఘట్ట మండలం రాయదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లా ఫోన్ నంబర్ : 9346314349

భారత రాజ్యాంగం ద్వారా వివిధ స్థాయిలలో ఏర్పాటు కాబడిన ప్రభుత్వాలు

Image
భారత రాజ్యాంగం ద్వారా వివిధ స్థాయిలలో ఏర్పాటు కాబడిన ప్రభుత్వాలు : 1. కేంద్ర ప్రభుత్వం -  (భారత ప్రభుత్వం) -  ఆర్టికల్ 52 నుండి 151 2. రాష్ట్ర ప్రభుత్వాలు - 28 - ( ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) - ఆర్టికల్ 152 నుంచి 237 3. కేంద్రపాలిత ప్రాంతాలు - 8 (ఆర్టికల్ 239 నుంచి 242 వరకు) 4. స్థానిక ప్రభుత్వాలు - గ్రామీణ ప్రాంతాలలో :  i. జిల్లాస్థాయి ప్రభుత్వాలు - జిల్లా ప్రజా పరిషత్తు - 13 { ఆర్టికల్ 243 - 243 (ఒ) } ii. బ్లాకు/ మధ్యస్థాయి మండల ప్రజా పరిషత్తు - 660 { ఆర్టికల్ 243 - 243 (ఒ) } iii. గ్రామ స్థాయి - గ్రామ పంచాయతీ - 13371 { ఆర్టికల్ 243 - 243 (ఒ) } iv. స్థానిక ప్రభుత్వాలు - పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు - {ఆర్టికల్ 243 (P) నుండి 243 (Z) వరకు } A)  స్థానిక ప్రభుత్వాల ఆవిర్భావం, ఎదుగుదల, మైలురాళ్ళు  : భారత దేశంలో పంచాయతీరాజ్ పరిణామక్రమంలో  ముఖ్యమైన మైలురాళ్ళు.....  i. 1687 మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ii. 1870 పట్టణాలలో స్థానిక సంస్థలపై లార్డ్ మేయో తీర్మానం iii. 1882 స్థానిక స్వపరిపాలన (మున్సిపల్) పై చారిత్రాత్మక తీర్మానం లార్డ్ రిప్పన్ i...

మనదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ముఖ్య లక్షణాలు

Image
మన దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ముఖ్య లక్షణాలు :  • 18 సంవత్సరాలు నిండిన భారత దేశ పౌరులందరికీ ఓటు హక్కు కల్పించబడింది. • స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ :   క్రమం తప్పకుండా ఎన్నికల నిర్వహణ ద్వారా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు. • స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహించుటకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం. • స్వతంత్ర న్యాయ వ్యవస్థ : రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రజల హక్కులకు స్వతంత్ర న్యాయ వ్యవస్థల ద్వారా రక్షణ కల్పించడం.  • అధికరణ - 40 : భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన వికేంద్రీకరణ గ్రామస్థాయి వరకు విస్తరింప చేయటం ద్వారా స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు.  • పరిపాలన వికేంద్రీకరణ ద్వారా స్థానిక ప్రభుత్వాలకు నిధులు అధికారాలు ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు చేయడం. • స్థానిక ప్రభుత్వాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా సిఫారసులు.  • ప్రజలందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పిస్తూనే కొన్ని ప్రత్యేక వర్గాలకు, మహిళలకు ప్రత్యేకమైన హక్కులను కల్పిస్తూ వారి అవకాశాలను పరిరక్షించడం.  • స్థానిక ప్రభుత్వాలు భారత...

భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనడానికి ఆధారాలు

Image
భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనడానికి ఆధారాలు :  ప్రజల కోరికలు, అవసరాల మేరకు ప్రభుత్వాలు పని చేయాలని ఇప్పటికే తెలుసుకున్నాము. మరియు పరిపాలన జనరంజకంగా, చట్టబద్ధంగా జరగడం కోసం మనదేశంలో రాజ్యాంగాన్ని రచించుకొని, ఆమోదించుకుని అమలు చేసుకుంటున్నాము‌.  భారత రాజ్యాంగ స్ఫూర్తిని, లక్ష్యాలను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగ పీఠిక అద్దం పడుతుంది‌. మన రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందించబడింది. 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ప్రభుత్వాలను ప్రజాస్వామ్యబద్ధంగా నడుపుకోవడానికి రాజ్యాంగంలో 470 ఆర్టికల్స్,  25 భాగాలు, 12 షెడ్యూళ్లతో చట్టపరమైన నియమ నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రభుత్వాలు ఈ నిబంధనల ప్రకారమే ప్రజా పరిపాలన చేయాలి. అలా చేయని పక్షంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. ఈ విధంగా మన దేశంలో ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతూ పరిరక్షించబడుతున్నది  నాయకుల రాజేష్ సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ, గుమ్మఘట్ట మండలం, అనంతపురం జిల్లా, ఫోన్ నంబర్ 9346314349

మన భాతదేశంలో వివిధ పరిపాలనా విధానాలు

Image
మన భారతదేశంలో వివిధ పరిపాలనా విధానాలు  1. ఆటవిక రాజ్యం :- చట్టబద్దత లేని పాలన అనర్ధదాయకం. ఆ పాలన ప్రజల ఆమోదం లేనిది. అక్కడ ఆటవిక న్యాయం ఉంటుంది. అంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ.   2. సింధూ నాగరికత :- సరస్వతి - సింధూ నాగరికతలో బయలుపడిన పటిష్టకట్టడాలు, శిథిలాలు పరిపాలనకు సంబంధించినవే అని చరిత్రకారులు నిర్ణయించారు. చట్టపరమైన కట్టుబాట్లు, ప్రజల ఆమోదం ఉండవచ్చునని తెలుస్తున్నది.  3. రాచరికం :-  ఆర్యుల కాలంలోనూ, మరియు రాజులైన కనిష్కులు, మౌర్యులు, గుప్తులు, హూణులు మొదలైన వారందరూ "ధర్మశాస్త్రాలు", "ప్రాంతీయ కట్టుబాట్లు", "ఆచార వ్యవహారాలు" మొదలైన ప్రజామోదం పొందిన చట్టబద్ధత కలిగిన పరిపాలన సాగించారు. "సభ" మరియు "సమితి" ప్రజల ఆమోదానికి తార్కాణం. 4. మధ్యయుగ పరిపాలన :- మధ్యయుగ పరిపాలనలో ఆఫ్గాన్ లు, తురుష్కులు, మొఘలులు, పరిపాలించేటప్పుడు "ధర్మశాస్త్రాలు", "ప్రాంతీయ కట్టుబాట్లు", "ఆచార వ్యవహారాలు" కాకుండా ముస్లీం "షారియా" మరియు "ఉలేమాల సలహా"లతో పరిపాలన చేశారు. ఎంత రాజరికపు పరిపాలన అయినా ప్...

గ్రామ పంచాయతీలు - మన స్థానిక ప్రభుత్వాలు

Image
1. ప్రజాస్వామ్యం - ప్రజా పరిపాలన కొరకు ప్రభుత్వాలు  ప్రజాస్వామ్యం : ప్రతీ సమాజంలో చట్టపరమైన పరిపాలనా వ్యవస్థ అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చట్టబద్ధత లేని పరిపాలన అనర్ధాలకు దారి తీస్తుంది. ఇలాంటి చట్టబద్ధమైన పరిపాలన అందించుట కొరకు ఒక ప్రభుత్వ వ్యవస్థ ఉండాలి. గతంలో ఇలాంటి పరిపాలన వ్యవస్థ రాచరికం పద్దతిలో ఉండేది. అందులో రాజును ప్రభువుగా భావించేవారు. రాచరికం అంతరించిన తర్వాత ప్రజా ప్రభుత్వాల వైపు ప్రజలు మొగ్గు చూపారు. ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కొరకు ప్రజల వలన ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం. కనుక ప్రభుత్వాలు ప్రజల కోరికలు అవసరాల మేరకు పని చేయాలి. కానీ కొన్ని దేశాలలో ఉదాహరణకు ఉత్తర కొరియా లాంటి దేశాలలో ఇప్పటికీ నియంతృత్వ పాలన సాగుతున్నది.  స్వాతంత్రం సాధించినప్పటి నుండి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగానే కొనసాగుతున్నది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను మనదేశంలో ఇలాగే కొనసాగించుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. ప్రజలకు స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సమాన గౌరవం (సామాజిక న్యాయం) ఆర్థిక సాధికారత లభించాలంటే మన దేశం ప్రజాస్వామ్యం దేశంగానే కొనసాగాలి. మన దేశంలో మనం రాజ్యాంగం ద్వారా ఏర్పరచుకున్న కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట...

గ్రామ పంచాయతీ సర్పంచులకు ఉండవలసిన లక్షణాలు ?

Image
(దయచేసి పూర్తిగా చదవండి - ఈ సమాచారం సేకరించినది కాదు... పంచాయతీ పరిపాలనపై నాకున్న పరిజ్ఞానం, చట్టాలపై అవగాహనతో సొంతంగా ఆలోచించి 2018 సంవత్సరంలోనే రాసినది) పంచాయతీ సర్పంచులకు ఉండవలసిన లక్షణాలు: 1) కనీసం 5 నుండి 10వ తరగతి దాక అయినా చదువుకుని ఉండాలి. 2) తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. 3) గ్రామ పంచాయతీ పరిపాలన ఏవిధంగా చేయాలో అవగాహన కలిగి ఉండాలి. 4) ప్రతీరోజూ గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని  పరిష్కరించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. 5) పంచాయతీరాజ్ తనకు అప్పగించిన సర్పంచ్ విధులను మరియు పంచాయతీ విధులను సక్రమంగా నిర్వర్తించువారై ఉండాలి.అన్నీ రకాల పంచాయతీ రికార్డులను నిర్వహించే విధంగా కార్యదర్శి బాధ్యత తీసుకునే విధంగా పని చేయించాలి. అప్పడప్పుడు సర్పంచే ఆ రికార్డులను పరిశీలించాలి. 6) పంచాయతీ కార్యాలయాన్ని నిరుపయోగం కాకుండా , ప్రభుత్వ సంబంధిత అన్నీ పనులకు, చర్చలు, సభలు , సమావేశాలకు వాడుకోవాలి. 7) సంవత్సరానికి రెండు సార్లు తప్పకుండా గ్రామసభను నిర్వహిస్తూ ఆ సంవత్సరం గ్రామ పంచాయతీకి విడుదలైన నిధులు,గ్రాంటుల యొక్క వివరాలను ప్రజలకు తెలియపరచి వాటిని వినియోగించవ...

గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల విధులు & అధికారాలు ఏమిటి?

Image
గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల విధులు & అధికారాలు గ్రామ పంచాయతీ నందు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ , ప్రజలకు కావాల్సిన సౌకర్యాల కల్పనలో "వార్డు సభ్యుల" పాత్ర చాలా కీలకమైనది. వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ సమావేశముల యందు , వివిధ కార్యాచరణ కమిటీలలో సభ్యులుగా  తమ బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుంది. ఆదర్శవంతంగా విధులు నిర్వర్తించిన సభ్యులు గ్రామ పంచాయతికి చక్కని దిశను నిర్ధేశించగలుగుతారు. గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందించగలుగుతారు. 1) గ్రామ పంచాయతీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలి. 2)  సంబంధిత వార్డు మెంబర్ల గ్రామంలో సమస్యలు, ప్రజల అవసరాల గురించి పూర్తి అవగాహన కలిగియుండి వాటిని గ్రామ పంచాయతీ సమావేశాలు మరియు గ్రామసభ సమావేశాల దృష్టికి తీసుకు వచ్చి చర్చించి తగిన నిర్ణయాలు తీసుకొనుటకు చర్యలు గైకొనాలి. 3) సమావేశాల ఎజెండాలోని అంశాలను చదివి, తెలుసుకొని పూర్తీ సమాచారంతో సమావేశానికి హాజరై చర్చలో తమ అభిప్రాయాలను తెలపాలి. 4) సమావేశాలకు ఒకటి, రెండు రోజులు ముందుగానే తమ వార్డులోని ప్రజలను సమావేశపరచి తమ వార్డు సమస్యలు , ఇతర అంశాలు , ప్రత్యేకంగా చర్చించవలసిన విషయాల గురించి వార్డు ప్రజల అభిప్రా...

గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ అధికారాలు మరియు విధులు ఏమిటి ?

Image
గ్రామ పంచాయతీ  "ఉపసర్పంచ్ " అధికారాలు మరియు విధులు :   1) సర్పంచ్ అందుబాటులో లేని అన్నీ సందర్భాలలో ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించాలి. 2) సర్పంచ్ పదవి ఏ కారణం చేతనైనా ఖాళీ గా వున్నప్పుడు , తిరిగి సర్పంచ్ ఎంపిక జరిగే వరకు , సర్పంచ్ కు వుండే అధికారాలను , విధులను నిర్వహించే అధికారం ఉప సర్పంచ్ కు ఉంటుంది. 3) సర్పంచ్ వ్రాత పూర్వకంగా ఉప సర్పంచ్ కు కొన్ని అధికారాలను , విధులను దఖలు పరచినట్లైతే అట్టి అధికారాలను , విధులను ఉప సర్పంచు కలిగి వుంటారు. 4) ఉప సర్పంచ్ కూడా వార్డు సభ్యుడు లేదా సభ్యురాలే కనుక , వార్డు సభ్యునికి వుండే అన్నీ అధికారాలు, విధులను ఉప సర్పంచు కలిగి వుంటారు. 5) ఉప సర్పంచ్ గా పదవీ ప్రమాణం చేసిన 4 సంవత్సరాల తర్వాత మాత్రమే , 6) ఉప సర్పంచ్ మార్పును కోరుతూ గ్రామ పంచాయతీ సమావేశంలో అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టే వీలు వుంటుంది. నాయకుల రాజేష్  సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ, గుమ్మఘట్ట మండలం, అనంతపురం జిల్లా, ఫోన్ నంబర్ : 9346314349

గ్రామ పంచాయతీ " సర్పంచ్ " విధులు మరియు అధికారాలు

Image
గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడైన సర్పంచ్ విధులు మరియు అధికారాలు : 1) గ్రామ పంచాయతీ చే ఆమోదించబడిన తీర్మానాలు అమలు జరిపించే నిమిత్తం కార్యదర్శి పై పరిపాలనా పరమైన నియంత్రణ అధికారం కలిగి వుంటారు. 2) గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులను పరిశీలించుట. 3) ఉప సర్పంచ్ పదవికి ఖాళీ ఏర్పడిన తేదీ నుండి ఒక మాసములోగా ఉప సర్పంచ్ ఎన్నికకు ఏర్పాటు చేయుటకు గానూ జిల్లా పంచాయతీ అధికారి గారికి నివేదిక పంపుట. 4) సెక్షను 16 నుండి 20 వరకు గల సెక్షన్ల ప్రకారం సభ్యుల అనర్హతల గురించి  జిల్లా పంచాయతీ అధికారికి తెలియజేయుట. 5) గ్రామ పంచాయతీ ఆహార సలహా కమిటీ చైర్మన్ గా వుండాలి.ఛౌక డిపో కమిటీల సమావేశాలను ప్రతి నెలా నిర్వహించాలి.డీలర్లను గ్రామ పంచాయతీ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి వాటి పని తీరును సమీక్షించాలి. 6) మండల తహాశీల్దారు చౌక డీపోలకు కేటాయించు సరుకుల వివరములు వాటికి నిర్ణయించిన ధరలు , ప్రతీ రేషన్ కార్డుకు ఇచ్చు రేషన్ వివరములు పొందు అవకాశము కలదు. 7) గ్రామమునకు సంబంధించిన రేషన్ కార్డు వివరాల జాబితాను పొందే అధికారం. బోగస్ రేషన్ కార్డుల వివరాలను తహశీల్దారుకు తెలియజేయుట. 8) గ్రామ విద్యా కమిటీ అధ్యక్షులుగా...

గ్రామ పంచాయతీ విధులు మరియు అధికారాలు

Image
సెక్షన్ 45 ప్రకారం తప్పని సరిగా నిర్వహించనయవలసిన విధులు   1) గ్రామ ప్రంచాయతీ తన అధికార పరిధిలో గల భవనాలు ,రోడ్లు , వంతెనలు , కట్టలు, దారులు , మొదలైన వాటి నిర్మాణంల, నిర్వహణ చేయుట. 2) బహిరంగ స్థలాలలో , వీధలలో బజారుల్లో వీధి దీపాలను ఏర్పాటు చేయుట . 3) మురుగు నీరు , వర్షపు నీరు పోవుటకు కాలువలు నిర్మించి తగు విధంగా నిర్వహించడం . 4) గ్రామ పంచాయతీ లో వున్న బజార్లలోను , వీధులలోను వున్న చెత్త కుప్పలు, పిచ్చి మొక్కలు , పొదలు మొదలైన వాటిని తొలగించుట. 5) ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు - నిర్వహణ . 6) స్మశాన వాటికల ఏర్పాటు - దిక్కులేని శవాలను ఖననము చేయుట , జంతువుల కళేబరాలను పూడ్చుట. 7) అంటు వ్యాధుల నివారణ - కలరా , మలేరియా  వంటి వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకొనుట. 8) మంచినీటి బావులు , చెరువులు ఏర్పాటు - పోషణ , ప్రజలకు త్రాగునీరు సరఫరా . 9) కంపోస్టు ఎరువుల తయారీ . 10) జనన, మరణముల నమోదు. 11) బందెల దొడ్లు ఏర్పాటు - నిర్వహణ. 12) గ్రామ స్థాయిలో ఆర్థిక వనరుల సమీకరణ. 13) ఈ చట్టంతో పాటు , ఇతర శాసనాల ద్వారా తప్పని సరిగా నిర్వహించవలెనని ప్రభుత్వం భావించిన ఇతర అన్నీ విషయములు. --------------------------...

నాయకుడు అంటే ఎవరు ? నాయకత్వం అంటే ఏమిటి ? నాయకులు ఎన్ని రకాలు ?

Image
నాయకుడు అంటే : • ఒక వ్యక్తిని , వ్యక్తుల సమూహాన్ని ఒక నిర్ధేశిక లక్ష్యం వైపు సమిష్టిగా తీసుకువెళ్లగల వాడే నాయకుడు లేదా నాయకురాలు. నిర్ధేశిత లక్ష్యం వైపు తీసుకువెళ్లాలనే ఆలోచన రావడమే  నాయకత్వానికి పునాది. • నాయకులు పుట్టరు , నాయకులు తయారవుతారు. ఇంకా చెప్పాలంటే సమాజం వారిని తయారు చేస్తుంది. నాయకుడంటే సమాజాన్ని నడిపించేవాడు. • గ్రామంలో లేదా సమాజంలో సమస్య వున్నప్పుడు ప్రజలను సమీకరించి , సమస్య లోతుపాతుల గురించి క్షుణ్ణంగా చర్చించి , పరిష్కారాన్ని వెతకాలి. ఈ పరిష్కార మార్గం అందరికీ ఆమోదయోగ్యమైనదిగా వుండాలి. ఈ విధంగా మార్గనిర్ధేశకత్వం చేసినప్పుడు సమస్య పరిష్కారం కాగలదనే నమ్మకం కలుగజేసేవాడే నాయకుడు.  వెంటనే ప్రతిస్పందించక విషయాన్ని గమనించి , అర్థం చేసుకొని , విశ్లేషించి , నిర్ణయాత్మకంగా ఎవరైతే వ్యవహరిస్తారో వారినే నాయకుడు అనవచ్చు. ఎందుకనగా వారు కొంత ఆకర్షణీయమైన , అధికారయుతమైన గుణాలను కలిగి వుంటారు. •ఇ తరులు చెప్పే విషయాలను ఓపికగా , శ్రద్ధగా విని , పరిస్థితులకు అనుగుణంగా సర్ధుకుపోయే సామర్థ్యం నాయకునికి వుండాలి.  ------------------------------------------------------- నాయకత్వం అంటే...