గ్రామ పంచాయతీ " సర్పంచ్ " విధులు మరియు అధికారాలు
గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడైన సర్పంచ్ విధులు మరియు అధికారాలు :
1) గ్రామ పంచాయతీ చే ఆమోదించబడిన తీర్మానాలు అమలు జరిపించే నిమిత్తం కార్యదర్శి పై పరిపాలనా పరమైన నియంత్రణ అధికారం కలిగి వుంటారు.
2) గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులను పరిశీలించుట.
3) ఉప సర్పంచ్ పదవికి ఖాళీ ఏర్పడిన తేదీ నుండి ఒక మాసములోగా ఉప సర్పంచ్ ఎన్నికకు ఏర్పాటు చేయుటకు గానూ జిల్లా పంచాయతీ అధికారి గారికి నివేదిక పంపుట.
4) సెక్షను 16 నుండి 20 వరకు గల సెక్షన్ల ప్రకారం సభ్యుల అనర్హతల గురించి జిల్లా పంచాయతీ అధికారికి తెలియజేయుట.
5) గ్రామ పంచాయతీ ఆహార సలహా కమిటీ చైర్మన్ గా వుండాలి.ఛౌక డిపో కమిటీల సమావేశాలను ప్రతి నెలా నిర్వహించాలి.డీలర్లను గ్రామ పంచాయతీ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి వాటి పని తీరును సమీక్షించాలి.
6) మండల తహాశీల్దారు చౌక డీపోలకు కేటాయించు సరుకుల వివరములు వాటికి నిర్ణయించిన ధరలు , ప్రతీ రేషన్ కార్డుకు ఇచ్చు రేషన్ వివరములు పొందు అవకాశము కలదు.
7) గ్రామమునకు సంబంధించిన రేషన్ కార్డు వివరాల జాబితాను పొందే అధికారం. బోగస్ రేషన్ కార్డుల వివరాలను తహశీల్దారుకు తెలియజేయుట.
8) గ్రామ విద్యా కమిటీ అధ్యక్షులుగా ఉండాలి. ( విద్యాశాఖ జి.వో.120 , ది.31-3-99). పిల్లల హాజరు ఉత్తీర్ణతా శాతము పై పర్యవేక్షణ.
9) గ్రామ పంచాయతీ లో పనిచేసే సిబ్బంది సామర్థ్యం పై కాన్ఫిడెన్షియల్ రిపోర్టు రాయవచ్చు. (జి.వో.52, ది.4-2-1999).
10) గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే కార్యక్రమాలకు సర్పంచ్ ను తప్పక ఆహ్వానించాలి. ఆహ్వాన పత్తికలో , ప్రభుత్వ నిర్మాణాల శిలా ఫలకాలపై సర్పంచ్ పేరు వుండాలి. (జి.వో.209, ది.4-2-99)
11) స్వయం సహాయక బృందాల సమావేశాలకు సర్పంచ్ ప్రత్యేక ఆహ్వానితుడు.
12) జిల్లా పంచాయతీ అధికారి నుండి గుర్తింపు కార్డు పొందవచ్చును.
13) గ్రామమునకు సంబంధించి ఎంపిక చేసిన లబ్ధిదారుల ధరఖాస్తులపై సర్పంచ్ సంతకం వుండాలి.
చట్టములో నిర్ధేశించిన ఇతర అధికారాలను నిర్వహించాలి.
అత్యవసర పరిస్థితులందు అధికారాలు: సెక్షను - 33.
అత్యవసర పరిస్థితుల యందు ఏదైనా ఒక పనిని గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా చేయవలసి వచ్చినప్పుడు కార్యదర్శితో సంప్రదించి ఆ పనిని చేయుటకు ఆదేశమివ్వ వచ్చును. ఆ పని చేయుటకు గల పరిస్థితులను తదుపరి సమావేశము నందు తెలియజేసి ఆమోదము పొందాలి. నియమాలకు భిన్నముగా ఏ పని చేయరాదు.
నాయకుల రాజేష్
సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ, గుమ్మఘట్ట మండలం, అనంతపురం జిల్లా. ఫోన్ నంబర్ : 9346314349.

Comments
Post a Comment