మనదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ముఖ్య లక్షణాలు

మన దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ముఖ్య లక్షణాలు : 

• 18 సంవత్సరాలు నిండిన భారత దేశ పౌరులందరికీ ఓటు హక్కు కల్పించబడింది.

• స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ : 

క్రమం తప్పకుండా ఎన్నికల నిర్వహణ ద్వారా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు.

• స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహించుటకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం.

• స్వతంత్ర న్యాయ వ్యవస్థ : రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రజల హక్కులకు స్వతంత్ర న్యాయ వ్యవస్థల ద్వారా రక్షణ కల్పించడం. 

అధికరణ - 40 : భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన వికేంద్రీకరణ గ్రామస్థాయి వరకు విస్తరింప చేయటం ద్వారా స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు. 

• పరిపాలన వికేంద్రీకరణ ద్వారా స్థానిక ప్రభుత్వాలకు నిధులు అధికారాలు ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు చేయడం.

• స్థానిక ప్రభుత్వాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా సిఫారసులు. 

• ప్రజలందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పిస్తూనే కొన్ని ప్రత్యేక వర్గాలకు, మహిళలకు ప్రత్యేకమైన హక్కులను కల్పిస్తూ వారి అవకాశాలను పరిరక్షించడం. 

• స్థానిక ప్రభుత్వాలు భారత రాజ్యాంగ స్ఫూర్తితో తమ తమ స్థానిక ప్రభుత్వాల పరిధిలోని ప్రజలకు సామాజిక న్యాయంతో కూడిన ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం.


నాయకుల రాజేష్ 

సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ, గుమ్మఘట్ట మండలం, అనంతపురం జిల్లా, ఫోన్ నంబర్ : 9346314349

Comments

Popular posts from this blog

స్మృతుల్లో స్థిరంగా నిలిచిపోయే సేవలకు – ఇదే మా ఆత్మీయ వీడ్కోలు సభ

ప్రశ్న (జ్యోతిష్య శాస్త్రము)

శివాలయ సన్నిధిలో- కర్మగాథ