మహాత్మా గాంధీ గారి మాటలలో గ్రామ స్వరాజ్యం అంటే ?

గ్రామ స్వరాజ్య స్పూర్తి ప్రదాత జాతిపిత మహాత్మా గాంధీ గారి మాటలలో గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి ? 

1. గ్రామం స్వయంపాలన చేసుకుంటూ గణతంత్ర రాజ్యంగా విలసిల్లడం.

2. తన మౌలిక అవసరాలను తానే తీర్చుకుంటూ ఇరుగుపొరుగు గ్రామాలతో ఇచ్చిపుచ్చుకుంటూ, స్వయం సమృద్ధి సాధించి స్వయం ప్రతిపత్తి గల గ్రామంగా తయారుకావడం.

గాంధీజీ సూచించిన రక్షా రేకు (తావీదు) :- ఎప్పుడైనా తనకు, తను అనే స్వార్థం ఎక్కువ అయింది అనిపిస్తే ఈ రకంగా చేయాలి " అత్యంత పేదరికం అనుభవిస్తున్న మరియు బలహీనమైన వ్యక్తి ముఖాన్ని గుర్తు చేసుకో, నీవు చేయబోయే లేదా నీవు తీసుకునే నిర్ణయం వల్ల ఆ వ్యక్తికి ఏమైనా ఉపకరిస్తుందా అని ఆలోచించు. దీని వల్ల ఆ నిరుపేద వ్యక్తికి లాభమా? ఈ నిర్ణయం ఆ వ్యక్తి జీవితాన్ని, అతని అదృష్టాన్ని మారుస్తుందా? ఇంకో మాటలో చెప్పాలంటే నీ నిర్ణయం ఆకలితో అలమటిస్తున్న కోట్లాది మంది జీవితాలలో ఆకలి రూపుమాపి ఆధ్యాత్మిక/ ఆత్మ వికాస గ్రామస్వరాజ్యం సాధనకు దారితీస్తుందా?  అలా అయినట్లయితే నీలోని స్వార్థం తనకు తానే మంచులా కరిగి పోయి నీలోని అనుమానాలు పటాపంచలవుతాయి...

గ్రామస్వరాజ్యం… మహాత్ముడి స్వప్నం! గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు… గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది.. ఇవన్నీ ఇప్పటి వరకు మనం చదువుకున్నవే… నాయకుల ప్రసంగాలలో విన్నవే! కాని వాటి ఆచరణ దిశగా బలమైన అడుగులు ఎప్పుడూ పడలేదు.

దేశ చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయానికి శ్రీకారం చుడుతూ… స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే కాదు, నీతి, నిజాయితీతో కూడిన పాలన అందించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి గారు ముందడుగు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యవస్థలో పేరుకుపోయిన కుళ్ళును కడిగేలా ప్రక్షాళనకు నడుం కట్టారు. స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని అరికట్టే దిశగా బలమైన ప్రయత్నం జరిగింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో భారీ సంస్కరణలు చేపడుతూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామంలో సరికొత్త పరిపాలన విధానం సృష్టించి, ప్రజల అవసరాలను, సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా వ్యవస్థను బలంగా ఏర్పాటు చేసి మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సాధించారు...

-------------------------------------------------------

వ్యాసకర్త : నాయకుల రాజేష్

సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ, గుమ్మఘట్ట మండలం, రాయదుర్గం నియోజకవర్గం, అనంతపురం జిల్లా. ఫోన్ నంబర్ : 9346314349

--------------------------------------------------------

Comments

Popular posts from this blog

స్మృతుల్లో స్థిరంగా నిలిచిపోయే సేవలకు – ఇదే మా ఆత్మీయ వీడ్కోలు సభ

ప్రశ్న (జ్యోతిష్య శాస్త్రము)

శివాలయ సన్నిధిలో- కర్మగాథ