ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ఆవిర్భావం...
73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడిన IXవ భాగం లోని 243 ఆర్టికల్ కు అనుగుణంగా దేశమంతటా ఒకే రకమైన పంచాయతీ పాలన ఏర్పాటు చేయబడినది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో కూడా పాత చట్టాల్ని మార్పు చేశారు. ఇంతకుముందు మన రాష్ట్రంలో ఎ) గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల చట్టం - 1964. బి) మండల జిల్లా పరిషత్తు లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులు మరియు జిల్లా ప్రణాళిక, అభివృద్ధి సమీక్షా మండలాల చట్టం -1986. సి) ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంస్కరణల చట్టం 1989 అమలులో ఉండేవి. 73వ రాజ్యాంగ సవరణ తర్వాత ఈ మూడు చట్టాల స్థానంలో కొత్తగా ఒకే చట్టంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ఆమోదం పొంది 3-5-1994 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టంలో మొత్తం 8 భాగాలలో 278 సెక్షన్లు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం - 1994, 8 భాగములు మరియు 278 సెక్షన్లు...
సేకరణ వ్యాసకర్త : నాయకుల రాజేష్
సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ గుమ్మఘట్ట మండలం రాయదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లా ఫోన్ నంబర్ : 9346314349


Comments
Post a Comment