గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ అధికారాలు మరియు విధులు ఏమిటి ?
గ్రామ పంచాయతీ "ఉపసర్పంచ్ " అధికారాలు మరియు విధులు :
1) సర్పంచ్ అందుబాటులో లేని అన్నీ సందర్భాలలో ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించాలి.
2) సర్పంచ్ పదవి ఏ కారణం చేతనైనా ఖాళీ గా వున్నప్పుడు , తిరిగి సర్పంచ్ ఎంపిక జరిగే వరకు , సర్పంచ్ కు వుండే అధికారాలను , విధులను నిర్వహించే అధికారం ఉప సర్పంచ్ కు ఉంటుంది.
3) సర్పంచ్ వ్రాత పూర్వకంగా ఉప సర్పంచ్ కు కొన్ని అధికారాలను , విధులను దఖలు పరచినట్లైతే అట్టి అధికారాలను , విధులను ఉప సర్పంచు కలిగి వుంటారు.
4) ఉప సర్పంచ్ కూడా వార్డు సభ్యుడు లేదా సభ్యురాలే కనుక , వార్డు సభ్యునికి వుండే అన్నీ అధికారాలు, విధులను ఉప సర్పంచు కలిగి వుంటారు.
5) ఉప సర్పంచ్ గా పదవీ ప్రమాణం చేసిన 4 సంవత్సరాల తర్వాత మాత్రమే ,
6) ఉప సర్పంచ్ మార్పును కోరుతూ గ్రామ పంచాయతీ సమావేశంలో అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టే వీలు వుంటుంది.
నాయకుల రాజేష్
సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ, గుమ్మఘట్ట మండలం, అనంతపురం జిల్లా, ఫోన్ నంబర్ : 9346314349

Comments
Post a Comment