గ్రామ పంచాయతీలు - మన స్థానిక ప్రభుత్వాలు
1. ప్రజాస్వామ్యం - ప్రజా పరిపాలన కొరకు ప్రభుత్వాలు
ప్రజాస్వామ్యం :
ప్రతీ సమాజంలో చట్టపరమైన పరిపాలనా వ్యవస్థ అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చట్టబద్ధత లేని పరిపాలన అనర్ధాలకు దారి తీస్తుంది. ఇలాంటి చట్టబద్ధమైన పరిపాలన అందించుట కొరకు ఒక ప్రభుత్వ వ్యవస్థ ఉండాలి. గతంలో ఇలాంటి పరిపాలన వ్యవస్థ రాచరికం పద్దతిలో ఉండేది. అందులో రాజును ప్రభువుగా భావించేవారు. రాచరికం అంతరించిన తర్వాత ప్రజా ప్రభుత్వాల వైపు ప్రజలు మొగ్గు చూపారు. ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కొరకు ప్రజల వలన ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం. కనుక ప్రభుత్వాలు ప్రజల కోరికలు అవసరాల మేరకు పని చేయాలి. కానీ కొన్ని దేశాలలో ఉదాహరణకు ఉత్తర కొరియా లాంటి దేశాలలో ఇప్పటికీ నియంతృత్వ పాలన సాగుతున్నది.
స్వాతంత్రం సాధించినప్పటి నుండి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగానే కొనసాగుతున్నది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను మనదేశంలో ఇలాగే కొనసాగించుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. ప్రజలకు స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సమాన గౌరవం (సామాజిక న్యాయం) ఆర్థిక సాధికారత లభించాలంటే మన దేశం ప్రజాస్వామ్యం దేశంగానే కొనసాగాలి. మన దేశంలో మనం రాజ్యాంగం ద్వారా ఏర్పరచుకున్న కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలే ! ప్రజాస్వామ్యం ఇంకా క్రింద స్థాయిలకు విస్తరించు క్రమంలో లో స్థానిక ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేసుకొనుటకు మన భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది. మన స్థానిక ప్రభుత్వాలు అయిన గ్రామపంచాయతీ మండల ప్రజా పరిషత్ జిల్లా ప్రజా పరిషత్ లు కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలే ! ప్రజాస్వామ్యానికి మన స్థానిక ప్రభుత్వాలు గట్టి పునాదులు !
నాయకుల రాజేష్
సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ, గుమ్మఘట్ట మండలం, అనంతపురం జిల్లా ఫోన్ నంబర్ : 9346314349

Comments
Post a Comment