గ్రామ పంచాయతీ విధులు మరియు అధికారాలు

సెక్షన్ 45 ప్రకారం తప్పని సరిగా నిర్వహించనయవలసిన విధులు 

1) గ్రామ ప్రంచాయతీ తన అధికార పరిధిలో గల భవనాలు ,రోడ్లు , వంతెనలు , కట్టలు, దారులు , మొదలైన వాటి నిర్మాణంల, నిర్వహణ చేయుట.

2) బహిరంగ స్థలాలలో , వీధలలో బజారుల్లో వీధి దీపాలను ఏర్పాటు చేయుట .

3) మురుగు నీరు , వర్షపు నీరు పోవుటకు కాలువలు నిర్మించి తగు విధంగా నిర్వహించడం .

4) గ్రామ పంచాయతీ లో వున్న బజార్లలోను , వీధులలోను వున్న చెత్త కుప్పలు, పిచ్చి మొక్కలు , పొదలు మొదలైన వాటిని తొలగించుట.

5) ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు - నిర్వహణ .

6) స్మశాన వాటికల ఏర్పాటు - దిక్కులేని శవాలను ఖననము చేయుట , జంతువుల కళేబరాలను పూడ్చుట.

7) అంటు వ్యాధుల నివారణ - కలరా , మలేరియా  వంటి వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకొనుట.

8) మంచినీటి బావులు , చెరువులు ఏర్పాటు - పోషణ , ప్రజలకు త్రాగునీరు సరఫరా .

9) కంపోస్టు ఎరువుల తయారీ .

10) జనన, మరణముల నమోదు.

11) బందెల దొడ్లు ఏర్పాటు - నిర్వహణ.

12) గ్రామ స్థాయిలో ఆర్థిక వనరుల సమీకరణ.

13) ఈ చట్టంతో పాటు , ఇతర శాసనాల ద్వారా తప్పని సరిగా నిర్వహించవలెనని ప్రభుత్వం భావించిన ఇతర అన్నీ విషయములు.

--------------------------------------------------------

గ్రామ పంచాయతీ నిర్వహించవలసిన ఇతర విధులు:

(1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టము - సెక్షను. 60-63 , 68,69,70,71,73 )

1) వివిధ రకాలైన పన్నులు విధించడం , వసూలు చేయడం .

2) అనుమతులు లేని ప్రకటనలు తొలగించడం. (సెక్షను- 67)

3) లైసెన్సు లేని పందులను, కుక్కలను నిర్మూలించడం. (సెక్షను - 92)

4) దురాక్రమణలు తొలగించడం (సెక్షను -98)

5) రోడ్లపై ఆటంకాలు, గుంటలు త్రవ్వడాన్ని నిషేదించడం.          ( సెక్షను -101) 

6) అనుమతి లేకుండా పబ్లిక్ రోడ్లపై చెట్లు నాటడం లేదా కొట్టివేయుట. ( సెక్షను-102)

7) పబ్లిక్ రోడ్లపై అమ్మకాలు నిషేదించటం. ( సెక్షను -111)

8) ప్రైవేటు మార్కెట్లకు లైసెన్సు ఇవ్వడం .( సెక్షను - 105 )

9) ఇండ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం . (సెక్షను-121)

10) ఆవిరి, విద్యుత్ వంటి ఏ శక్తితోనైనా పనిచేసే యంత్రాల వలన కలిగెడి న్యూసెన్సు తొలగించడానికి , సంభవించెడు న్యూసెన్సు పై నిషేదం విధించే అధికారం.(సెక్షను-122) లైసెన్సు ఇవ్వడం.

--------------------------------------------------------

నాయకుల రాజేష్ 

గ్రామ వాలంటీర్, సిరిగేదొడ్డి గ్రామ సచివాలయం, గుమ్మఘట్ట మండలం, రాయదుర్గం నియోజకవర్గం

Comments

Popular posts from this blog

స్మృతుల్లో స్థిరంగా నిలిచిపోయే సేవలకు – ఇదే మా ఆత్మీయ వీడ్కోలు సభ

ప్రశ్న (జ్యోతిష్య శాస్త్రము)

శివాలయ సన్నిధిలో- కర్మగాథ