భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనడానికి ఆధారాలు

భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనడానికి ఆధారాలు : 

ప్రజల కోరికలు, అవసరాల మేరకు ప్రభుత్వాలు పని చేయాలని ఇప్పటికే తెలుసుకున్నాము. మరియు పరిపాలన జనరంజకంగా, చట్టబద్ధంగా జరగడం కోసం మనదేశంలో రాజ్యాంగాన్ని రచించుకొని, ఆమోదించుకుని అమలు చేసుకుంటున్నాము‌.  భారత రాజ్యాంగ స్ఫూర్తిని, లక్ష్యాలను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగ పీఠిక అద్దం పడుతుంది‌.

మన రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందించబడింది. 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ప్రభుత్వాలను ప్రజాస్వామ్యబద్ధంగా నడుపుకోవడానికి రాజ్యాంగంలో 470 ఆర్టికల్స్,  25 భాగాలు, 12 షెడ్యూళ్లతో చట్టపరమైన నియమ నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రభుత్వాలు ఈ నిబంధనల ప్రకారమే ప్రజా పరిపాలన చేయాలి. అలా చేయని పక్షంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. ఈ విధంగా మన దేశంలో ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతూ పరిరక్షించబడుతున్నది 


నాయకుల రాజేష్

సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ, గుమ్మఘట్ట మండలం, అనంతపురం జిల్లా, ఫోన్ నంబర్ 9346314349

Comments

Popular posts from this blog

స్మృతుల్లో స్థిరంగా నిలిచిపోయే సేవలకు – ఇదే మా ఆత్మీయ వీడ్కోలు సభ

ప్రశ్న (జ్యోతిష్య శాస్త్రము)

శివాలయ సన్నిధిలో- కర్మగాథ