మన భాతదేశంలో వివిధ పరిపాలనా విధానాలు
మన భారతదేశంలో వివిధ పరిపాలనా విధానాలు
1. ఆటవిక రాజ్యం :-
చట్టబద్దత లేని పాలన అనర్ధదాయకం. ఆ పాలన ప్రజల ఆమోదం లేనిది. అక్కడ ఆటవిక న్యాయం ఉంటుంది. అంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ.2. సింధూ నాగరికత :-
సరస్వతి - సింధూ నాగరికతలో బయలుపడిన పటిష్టకట్టడాలు, శిథిలాలు పరిపాలనకు సంబంధించినవే అని చరిత్రకారులు నిర్ణయించారు. చట్టపరమైన కట్టుబాట్లు, ప్రజల ఆమోదం ఉండవచ్చునని తెలుస్తున్నది.3. రాచరికం :-
ఆర్యుల కాలంలోనూ, మరియు రాజులైన కనిష్కులు, మౌర్యులు, గుప్తులు, హూణులు మొదలైన వారందరూ "ధర్మశాస్త్రాలు", "ప్రాంతీయ కట్టుబాట్లు", "ఆచార వ్యవహారాలు" మొదలైన ప్రజామోదం పొందిన చట్టబద్ధత కలిగిన పరిపాలన సాగించారు. "సభ" మరియు "సమితి" ప్రజల ఆమోదానికి తార్కాణం.4. మధ్యయుగ పరిపాలన :-
మధ్యయుగ పరిపాలనలో ఆఫ్గాన్ లు, తురుష్కులు, మొఘలులు, పరిపాలించేటప్పుడు "ధర్మశాస్త్రాలు", "ప్రాంతీయ కట్టుబాట్లు", "ఆచార వ్యవహారాలు" కాకుండా ముస్లీం "షారియా" మరియు "ఉలేమాల సలహా"లతో పరిపాలన చేశారు. ఎంత రాజరికపు పరిపాలన అయినా ప్రజల ఆమోదమే వారికి చట్టబద్ధమైన పరిపాలన అందించడానికి అర్హతను నిర్దేశిస్తుంది.5. బ్రిటిష్ పరిపాలన :-
బ్రిటిష్ పరిపాలన భారతదేశ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా కొనసాగించారు. బ్రిటిష్ చట్టాలు భారత దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించడం వలన మరియు ప్రజల ఆమోదానికి దూరంగా ఉండటం వలన వారి పరిపాలన ప్రజల అంగీకారం పొందలేదు.6. ప్రజాస్వామ్య ప్రభుత్వం :-
1946 రాజ్యాంగ పరిషత్తు ప్రజల భాగస్వామ్యానికి ప్రతీకగా భారత రాజ్యాంగ రూపకర్తగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆవిర్భవించి భారత రాజ్యాంగాన్ని రచించారు. తదనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తి మరియు రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వ పాలనా వ్యవస్థలు ఇప్పుడు పని చేస్తున్నాయి.నాయకుల రాజేష్
సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ, గుమ్మఘట్ట మండలం, అనంతపురం జిల్లా ఫోన్ నంబర్ - 9346314349







చాలా మంచి సమాచారం రాజా
ReplyDelete