మన భారతదేశంలో వివిధ పరిపాలనా విధానాలు 1. ఆటవిక రాజ్యం :- చట్టబద్దత లేని పాలన అనర్ధదాయకం. ఆ పాలన ప్రజల ఆమోదం లేనిది. అక్కడ ఆటవిక న్యాయం ఉంటుంది. అంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ. 2. సింధూ నాగరికత :- సరస్వతి - సింధూ నాగరికతలో బయలుపడిన పటిష్టకట్టడాలు, శిథిలాలు పరిపాలనకు సంబంధించినవే అని చరిత్రకారులు నిర్ణయించారు. చట్టపరమైన కట్టుబాట్లు, ప్రజల ఆమోదం ఉండవచ్చునని తెలుస్తున్నది. 3. రాచరికం :- ఆర్యుల కాలంలోనూ, మరియు రాజులైన కనిష్కులు, మౌర్యులు, గుప్తులు, హూణులు మొదలైన వారందరూ "ధర్మశాస్త్రాలు", "ప్రాంతీయ కట్టుబాట్లు", "ఆచార వ్యవహారాలు" మొదలైన ప్రజామోదం పొందిన చట్టబద్ధత కలిగిన పరిపాలన సాగించారు. "సభ" మరియు "సమితి" ప్రజల ఆమోదానికి తార్కాణం. 4. మధ్యయుగ పరిపాలన :- మధ్యయుగ పరిపాలనలో ఆఫ్గాన్ లు, తురుష్కులు, మొఘలులు, పరిపాలించేటప్పుడు "ధర్మశాస్త్రాలు", "ప్రాంతీయ కట్టుబాట్లు", "ఆచార వ్యవహారాలు" కాకుండా ముస్లీం "షారియా" మరియు "ఉలేమాల సలహా"లతో పరిపాలన చేశారు. ఎంత రాజరికపు పరిపాలన అయినా ప్...