5 రోజుల్లో టాయిలెట్స్ సమస్యపై విజయం సాధించిన సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ !

2017వ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేది. నేను మా గ్రామంలో జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉండేవాడిని... కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా రాజకీయాలపై ఆసక్తి ఉండేది కాదు... అయినప్పటికీ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని... అటువంటి సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్న ప్రజలను గుర్తించి వారికి న్యాయం జరిగేలా చూడాలని, ప్రతీ జన్మభూమి మీటింగ్ లో ప్రజల తరుపున గ్రామ సమస్యలు మరియు వారి వ్యక్తిగత సమస్యలపై అర్జీలు రాసి అధికారులకు అందిస్తూ ఉండేవాడిని. కొన్ని సమయాల్లో ప్రజలకు న్యాయం జరగడంలో ఆలస్యమైతే ప్రభుత్వాన్ని నిర్భయంగా ప్రశ్నించడంతో కొంతమంది అధికార పార్టీ నాయకులకు నేను వ్యతిరేకిగా మారవలసి వచ్చింది. 

ఈ నేపథ్యంలోనే 09/10/2017 నా పుట్టినరోజు. అప్పటికి నాకు 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుండి గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశాలు, గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పోస్టింగ్ చేస్తూ ఉండేవాడిని. 2017 అక్టోబర్ నెలలో వర్షాలు అధికంగా కురవడంతో గ్రామానికి తూర్పున ఉండే నల్లమెట్ట రోడ్డు బురుదమయమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకరోజు నేను ఆ మార్గంలో నడుచుకుంటూ మా పొలానికి వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు చేతిలో చెంబు పట్టుకొని వస్తున్నారు. వాళ్లను ఆపి ఎక్కడికి వెళ్లి వస్తున్నారని అడగ్గా... కాలకృత్యాలు తీర్చుకోవడానికి అని సమాధానం ఇచ్చారు. వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రజలు తమ ఇంటి పక్కనే మరుగుదొడ్డి లేనందువల్ల పని వదులుకుని కొంతమంది ఊరికి దూరంగా, ఇంకొంతమంది ఊరికి పక్కనే రోడ్లకు ఇరువైపులా ఉన్న స్థలంలో కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. దీని వల్ల అపరిశుభ్రత, దారిలో ప్రయాణించే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఇక మహిళలకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఉపయోగం లేదు. కాబట్టి ఈసారి కొత్తగా ప్రయత్నించాలని, చెంబుతో ఉన్న ఇద్దరు వ్యక్తులను నిలబెట్టి ఫోటో తీసి దానికి కొంత సమాచారం జోడించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. 

1వ రోజు : 21/10/2017 

https://m.facebook.com/story.php?story_fbid=126677084755378&id=100022392624285 

2వ రోజు : 22 /10/2017 

21/10/2017 న మరుగుదొడ్డి లేని సిరిగేదొడ్డి అనే శీర్షికతో సామాజిక మాధ్యమాల్లో సమస్య గురించి విస్తృతంగా ప్రచారం అయింది. ఆ సమయంలో ఆంధ్రజ్యోతి విలేకరి 22/10/2017న గ్రామంలో పర్యటించి బాధితులతో సమస్య యొక్క తీవ్రతను తెలుసుకున్నారు... 

3వ రోజు : 23/10/2017 

23/10/2017 న మరుగుదొడ్డి లేని సిరిగేదొడ్డి సమస్యపై ఆంధ్రజ్యోతి దినపత్రికతో "సిగ్గు సిగ్గు" అంటూ ప్రత్యేక కథనం ప్రచురితమైంది. స్వాతంత్ర్యం అప్పటికి వచ్చి 70 సంవత్సరాలైనా నేటికీ గ్రామాల్లో కనీస అవసరాలైన మరుగుదొడ్డి లేకపోవడం సిగ్గు చేటు అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కథనం ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు కనువిప్పు కలిగించింది. 

https://m.facebook.com/story.php?story_fbid=128144954608591&id=100022392624285





4వ రోజు : 24/10/2017 

ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ప్రజా ప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు 25/10/2017 సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ కేంద్రంలో మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలనే సంకల్పంతో 24/10/2017న గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద శంకుస్థాపన శిలా ఫలకాన్ని నిర్మించి, గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి, గ్రామంలోని అపరిశుభ్రంగా ఉన్న స్థలాల్లో జేసిబీతో క్లీన్ చేయించి సర్వం సిద్ధం చేశారు... 

https://m.facebook.com/story.php?story_fbid=128418391247914&id=100022392624285









5వ రోజు : 25/10/2017  
25/10/2017న అనుకున్న దానికంటే గొప్పగా రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా 26,000 మరుగుదొడ్ల శంకుస్థాపన కార్యక్రమం మంత్రి కాల్వ శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు గారి చేతుల మీదుగా గుమ్మగట్ట మండలం, సిరిగేదొడ్డి గ్రామంలో సంపూర్ణంగా విజయవంతం అయింది.


 రుసటి రోజు : 26/10/2017  
ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలలో కార్యక్రమం గురించి ప్రచురించిన సమాచారం

https://m.facebook.com/story.php?story_fbid=129697284453358&id=100022392624285 

అభినందనలు తెలియజేసిన రాయదుర్గం అభివృద్ధి వేదిక కన్వీనర్ ఆవుల మనోహర్ గారు. 







నాయకుల రాజేష్
గ్రామ వాలంటీర్, సిరిగేదొడ్డి గ్రామ సచివాలయం, గుమ్మఘట్ట మండలం, అనంతపురం జిల్లా.

Comments

Popular posts from this blog

స్మృతుల్లో స్థిరంగా నిలిచిపోయే సేవలకు – ఇదే మా ఆత్మీయ వీడ్కోలు సభ

ప్రశ్న (జ్యోతిష్య శాస్త్రము)

శివాలయ సన్నిధిలో- కర్మగాథ