వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా బురద రోడ్డుకు స్వంత ఖర్చులతో తాత్కాలిక మరమ్మత్తులు.
గుమ్మఘట్ట మండలం : సిరిగేదొడ్డి - 09/08/2022 మంగళవారం. నా వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఉన్న ట్రాక్టర్ యజమానులు నలుగురితో మాట్లాడి బురదగా మారిన 300 మీటర్ల మట్టి రోడ్డును JCB బాడుగ మరియు ట్రాక్టర్ల డీజిల్ ఖర్చు భరించుకుని దాదాపు 30 ట్రిప్పుల మట్టి మరియు నాలుగు గంటల JCB పని ద్వారా తాత్కాలికంగా సమస్యకు పరిష్కారం సాధించడం జరిగింది. ట్రాక్టర్ యజమానుల సహకారంతో నేను భరించుకున్న మొత్తం ఖర్చు : 13000/- రూపాయలు. ఇందుకు సహకరించిన భూతయ్యదొడ్డి ట్రాక్టర్ యజమానులు " 1) గాదిరయ్య గారి పెద్ద భీమయ్య కుమారుడు పాలనాయక, 2) గాదిరయ్య గారి అంజినయ్య కుమారుడు రాముడు, 3) బిజికెర ఓబన్న కుమారులు గొడ్లయ్య మరియు క్రిష్ణమూర్తి 4) బాగనపల్లి బోరన్న కుమారుడు పాలయ్య.. వీరందరికీ సిరిగేదొడ్డి గ్రామ ప్రజల తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నాయకుల రాజేష్ - గ్రామ వాలంటీర్, సిరిగేదొడ్డి గ్రామ సచివాలయం