Posts

Showing posts from January, 2022

నా జీవిత ప్రస్థానంలో వార్తాపత్రికల కథనాలు

Image
పేదవారికి చేసే సేవను ‘నారాయణ సేవ’గా అభివర్ణించిన వివేకానందుని లోతైన ఆలోచనను మనమంతా అర్థం చేసుకోవాలని, మందలో ఒకడిగా కాకుండా, వందలో ఒకడిగా ఉంటూ,  వారి బోధనలను యువత నిజజీవితంలో పాటించాలని ఆకాంక్షిస్తున్నాను. మీ.... నాయకుల రాజేష్    

5 రోజుల్లో టాయిలెట్స్ సమస్యపై విజయం సాధించిన సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ !

Image
2017వ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేది. నేను మా గ్రామంలో జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉండేవాడిని... కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా రాజకీయాలపై ఆసక్తి ఉండేది కాదు... అయినప్పటికీ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని... అటువంటి సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్న ప్రజలను గుర్తించి వారికి న్యాయం జరిగేలా చూడాలని, ప్రతీ జన్మభూమి మీటింగ్ లో ప్రజల తరుపున గ్రామ సమస్యలు మరియు వారి వ్యక్తిగత సమస్యలపై అర్జీలు రాసి అధికారులకు అందిస్తూ ఉండేవాడిని. కొన్ని సమయాల్లో ప్రజలకు న్యాయం జరగడంలో ఆలస్యమైతే ప్రభుత్వాన్ని నిర్భయంగా ప్రశ్నించడంతో కొంతమంది అధికార పార్టీ నాయకులకు నేను వ్యతిరేకిగా మారవలసి వచ్చింది.  ఈ నేపథ్యంలోనే 09/10/2017 నా పుట్టినరోజు. అప్పటికి నాకు 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుండి గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశాలు, గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పోస్టింగ్ చేస్తూ ఉండేవాడిని. 2017 అక్టోబర్ నెలలో వర్షాలు అధికంగా కురవడంతో గ్రామానికి తూర్పున ఉ...