నాయకుడు అంటే ఎవరు ? నాయకత్వం అంటే ఏమిటి ? నాయకులు ఎన్ని రకాలు ?

నాయకుడు అంటే :

• ఒక వ్యక్తిని , వ్యక్తుల సమూహాన్ని ఒక నిర్ధేశిక లక్ష్యం వైపు సమిష్టిగా తీసుకువెళ్లగల వాడే నాయకుడు లేదా నాయకురాలు. నిర్ధేశిత లక్ష్యం వైపు తీసుకువెళ్లాలనే ఆలోచన రావడమే  నాయకత్వానికి పునాది.

• నాయకులు పుట్టరు , నాయకులు తయారవుతారు. ఇంకా చెప్పాలంటే సమాజం వారిని తయారు చేస్తుంది. నాయకుడంటే సమాజాన్ని నడిపించేవాడు.

• గ్రామంలో లేదా సమాజంలో సమస్య వున్నప్పుడు ప్రజలను సమీకరించి , సమస్య లోతుపాతుల గురించి క్షుణ్ణంగా చర్చించి , పరిష్కారాన్ని వెతకాలి. ఈ పరిష్కార మార్గం అందరికీ ఆమోదయోగ్యమైనదిగా వుండాలి. ఈ విధంగా మార్గనిర్ధేశకత్వం చేసినప్పుడు సమస్య పరిష్కారం కాగలదనే నమ్మకం కలుగజేసేవాడే నాయకుడు.  వెంటనే ప్రతిస్పందించక విషయాన్ని గమనించి , అర్థం చేసుకొని , విశ్లేషించి , నిర్ణయాత్మకంగా ఎవరైతే వ్యవహరిస్తారో వారినే నాయకుడు అనవచ్చు. ఎందుకనగా వారు కొంత ఆకర్షణీయమైన , అధికారయుతమైన గుణాలను కలిగి వుంటారు.

•ఇతరులు చెప్పే విషయాలను ఓపికగా , శ్రద్ధగా విని , పరిస్థితులకు అనుగుణంగా సర్ధుకుపోయే సామర్థ్యం నాయకునికి వుండాలి. 

-------------------------------------------------------

నాయకత్వం అంటే : 

• సమిష్టి లక్ష్యాలను సాధించడానికి తమ తోటి వారిని ప్రభావితం చేయగలిగి ముందుండి నడిపించగల సామర్థ్యాన్ని కలిగి ఉండడమే నాయకత్వం. 

నాయకుడు కలలు కనే ప్రపంచంలోనికి ఇతరులను తీసుకొని రాగలగాలి. 

• శ్రోతగా వుండాలి.

• ఇతరులు చెప్పే విషయాన్ని ఆశక్తిగా వినుట, విన్నదాన్ని ఒక క్రమంలో కూర్చి ఇతరులకు చెప్పగలగాలి.

• గొప్ప లక్ష్యం కోసం తన అవసరాలను సైతం త్యాగం చేయాలి.

• ప్రజలకు దగ్గరగా వుండి వారికి ఏం కావాలో  , ఎందుకు కావాలో తెలుసుకోవాలి

• నిజాయతీగా ఉండి సమాజం కోసం పని చేయాలి

• తపన , క్రమశిక్షణ , అంకితభావం , నిబద్ధత కలిగి వుండాలి.

• ఇతరులకు సహాయం చేయడం , ధైర్య సాహసాలు కలిగి వుండటం , సర్దుబాటు , స్థిరమైన మనస్థత్వం కలిగి ఉండాలి.

------------------------------------------------------

నాయకులలోని రకాలు :-

1) నిరంకుశ వాది - తాను అనుకున్నదే చేయాలనుకుంటారు. స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. మంచి,చెడులను చూడకుండా పనులు జరగడం పైనే దృష్టి కేంద్రీకరిస్తారు.

2) ఉదార వాది - బాధ్యతలను ఇతరుకు అప్పగించి తాను పక్కకు తప్పుకుంటాడు. వారికి స్వతంత్ర్య నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఇస్తారు. పర్యవేక్షణలో ముందుండి మార్గదర్శకత్వం వహిస్తారు

3) ఉద్యోగస్వామ్య వాది - నిబంధనలకు లోబడి పనిచేస్తానంటాడు.

4) ప్రజాస్వామ్య వాది - అందరితో సత్సంబంధం కలిగి ఉంటారు. అందరితో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజల సంక్షేమం పైనే దృష్టి కేంద్రీకరిస్తారు. బృందాన్ని నడపడంలో సామర్థ్యాన్ని కలిగి వుంటారు.

-------------------------------------------------------నాయకుల రాజేష్   

గ్రామ వాలంటీర్, సిరిగేదొడ్డి గ్రామ సచివాలయం, గుమ్మఘట్ట మండలం.

Comments

Post a Comment

Popular posts from this blog

స్మృతుల్లో స్థిరంగా నిలిచిపోయే సేవలకు – ఇదే మా ఆత్మీయ వీడ్కోలు సభ

ప్రశ్న (జ్యోతిష్య శాస్త్రము)

శివాలయ సన్నిధిలో- కర్మగాథ