భారత రాజ్యాంగం ద్వారా వివిధ స్థాయిలలో ఏర్పాటు కాబడిన ప్రభుత్వాలు

భారత రాజ్యాంగం ద్వారా వివిధ స్థాయిలలో ఏర్పాటు కాబడిన ప్రభుత్వాలు :


1. కేంద్ర ప్రభుత్వం - (భారత ప్రభుత్వం) -  ఆర్టికల్ 52 నుండి 151
2. రాష్ట్ర ప్రభుత్వాలు - 28 - ( ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) - ఆర్టికల్ 152 నుంచి 237
3. కేంద్రపాలిత ప్రాంతాలు - 8 (ఆర్టికల్ 239 నుంచి 242 వరకు)
4. స్థానిక ప్రభుత్వాలు - గ్రామీణ ప్రాంతాలలో : 
i. జిల్లాస్థాయి ప్రభుత్వాలు - జిల్లా ప్రజా పరిషత్తు - 13 { ఆర్టికల్ 243 - 243 (ఒ) }
ii. బ్లాకు/ మధ్యస్థాయి మండల ప్రజా పరిషత్తు - 660 { ఆర్టికల్ 243 - 243 (ఒ) }
iii. గ్రామ స్థాయి - గ్రామ పంచాయతీ - 13371 { ఆర్టికల్ 243 - 243 (ఒ) }
iv. స్థానిక ప్రభుత్వాలు - పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు - {ఆర్టికల్ 243 (P) నుండి 243 (Z) వరకు }

A)  స్థానిక ప్రభుత్వాల ఆవిర్భావం, ఎదుగుదల, మైలురాళ్ళు :

భారత దేశంలో పంచాయతీరాజ్ పరిణామక్రమంలో 
ముఖ్యమైన మైలురాళ్ళు..... 

i. 1687 మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు
ii. 1870 పట్టణాలలో స్థానిక సంస్థలపై లార్డ్ మేయో తీర్మానం
iii. 1882 స్థానిక స్వపరిపాలన (మున్సిపల్) పై చారిత్రాత్మక తీర్మానం లార్డ్ రిప్పన్
iv. 1935 భారత ప్రభుత్వ చట్టం - స్థానిక ప్రభుత్వాల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ. 
v. 1930 - 1940 మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం పై నిర్మాణాత్మక చర్యలలో భాగంగా విస్తృత ప్రచారం ( ఆదేశిక సూత్రాలు - 40, గ్రామ పంచాయతీలు)
vi. 1946 గ్రామ స్వరాజ్ భావన అమలు చేయడానికి నాటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫిర్కా ప్రయోగం - టంగుటూరి ప్రకాశం పంతులు
vii. 1957 మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ సిఫారసులు - బల్వంతరాయ్ మెహతా
viii. 1959 రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఆరంభం
ix. 1964 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల చట్టం
x. 1978 అశోక్ మెహతా కమిటీ - సిఫార్సులు పంచాయతీరాజ్ వ్యవస్థలో ముఖ్య మార్పులు
xi. 1986 ఆంధ్రప్రదేశ్ సమితి స్థానాలలో మండల పరిషత్ ల ఏర్పాటు
xii. 73వ రాజ్యాంగ సవరణ అమలు ఏప్రిల్ 24, 1993 మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అప్పటి దేశ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు గారి చొరవతో దేశమంతటా ఏర్పాటు. శ్రీ జి.వెంకటస్వామి గారిచే పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది.
xiii. 1993 ఏప్రిల్ 24న దేశమంతటా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు.
xiv. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం మే 30, 1994 నుండి అమలులోకి వచ్చింది. 
xv. భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల పంచాయతీలకు ప్రత్యేక పంచాయతీల విస్తరణ చట్టం - (పెసా చట్టం) 1996, పంచాయతీ రాజ్ చట్టం - 1994 సవరణ ద్వారా గిరిజన పంచాయతీల ప్రత్యేక నిబంధనలు 2011. 

అలాగే శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి మరియు శ్రీ జలగం వెంగళరావు గార్లు స్థానిక ప్రభుత్వాలలో జిల్లా పరిషత్ చైర్మన్ లుగా విజయవంతంగా పదవులను చేపట్టి తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఎదిగారు. ఇంకా మరెందరో ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రభుత్వాలలో తొలుత పనిచేసి ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్యులుగా శాసనసభ్యులుగా పని చేశారు ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతున్నది... 


సేకరణ వ్యాసకర్త : నాయకుల రాజేష్
సిరిగేదొడ్డి గ్రామపంచాయతీ, గుమ్మగట్ట మండలం, రాయదుర్గం నియోజకవర్గం, అనంతపురం జిల్లా. ఫోన్ నెంబర్ : 9346314349.

Comments

Post a Comment

Popular posts from this blog

స్మృతుల్లో స్థిరంగా నిలిచిపోయే సేవలకు – ఇదే మా ఆత్మీయ వీడ్కోలు సభ

ప్రశ్న (జ్యోతిష్య శాస్త్రము)

శివాలయ సన్నిధిలో- కర్మగాథ