Posts

స్మృతుల్లో స్థిరంగా నిలిచిపోయే సేవలకు – ఇదే మా ఆత్మీయ వీడ్కోలు సభ

Image
సిరిగేదొడ్డి గ్రామ సచివాలయ సిబ్బందికి ప్రత్యేకంగా అర్పించిన సన్మానం 2019లో గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో ప్రారంభమైన గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామస్థాయిలో పాలనను ప్రజలకు మరింత దగ్గర చేయడంలో అద్భుతమైన మార్పును తీసుకొచ్చింది. ఈ విధానంలో అనేక మంది ఉద్యోగులు తమ అంకితభావంతో ప్రజల మన్ననలు పొందారు. వారిలో ముఖ్యంగా క్రింది నలుగురు: వీరు 2019 నుండి 2025 వరకు సిరిగేదొడ్డి గ్రామ సచివాలయంలో నిబద్ధతతో సేవలందించారు. సాధారణ బదిలీలలో భాగంగా వీరు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వీరి సేవలను గుర్తిస్తూ, వీడ్కోలు సందర్భాన్ని మరపురానిదిగా నిలిపేందుకు సిరిగేదొడ్డి గ్రామ ప్రజానికం తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ గ్రామ వాలంటీర్‌గా – నేను కూడా పాల్గొన్నాను. ఈ కార్యక్రమం ఎంతో ఆత్మీయతతో, కుటుంబ సభ్యులను సాగనంపుతున్న భావనతో సాగింది. వారు మాకు ఉద్యోగులు మాత్రమే కాకుండా, గ్రామానికి మార్గదర్శకులుగా నిలిచారు. వీరి సేవల గుర్తుగా, మా గ్రామస్థులు హృదయపూర్వకంగా ఒక చిన్న సన్మానం ఏర్పాటు చేశారు. ఈ సన్మాన సభలో ప్రతి మాటలోనూ భావోద్వేగం, కృతజ్ఞత వెలిసింది. ఈ సిబ్బంది చేసిన పనులు ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచిపోయాయి. పథకాల అమ...

శివాలయ సన్నిధిలో- కర్మగాథ

Image
ఒకానొక సమయములో, ఓ రాజు తన మంత్రితో కలసి అడవిలో వేటకు బయలుదేరాడు. సాయంకాలం అయ్యే సరికి చీకటి అలముకుంది. తిరిగే మార్గం తారసపడక, వారు సమీపంలో ఉన్న శివాలయాన్ని ఆశ్రయించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. ఆ సమయంలో రాజుకు మూత్ర విసర్జన అవసరం ఏర్పడింది. కానీ అహంభావంతో, శివాలయ ప్రాంగణాన్నే అపవిత్రంగా భావించకుండానే, ఆ పక్కనేనే మూత్ర విసర్జన చేశాడు. ఆశ్చర్యకరంగా, ఆ వెంటనే అక్కడ మూడు విలువైన వజ్రాలు భూమిలోంచి బయటపడ్డాయి. రాజు ఆ వజ్రాలను చూసి విపరీతంగా ఆనందించాడు. వెంటనే తన మంత్రికి ఆ విషయాన్ని ఉల్లాసంగా వివరించాడు. కొద్ది సేపటికి మంత్రికి కూడా మూత్రవిసర్జన అవసరమయ్యింది. కానీ ఆయన దైవభయంతో, భక్తిశ్రద్ధలతో, శివాలయం నుండి దూరంగా వెళ్లి, సద్భావంతో మూత్ర విసర్జన చేసి తిరిగివస్తుండగా ఓ తేలు కాటు వేసింది. ఆ బాధతో అతడు రాజుని చేరి తాను ఎదుర్కొన్న కష్టాన్ని వివరించాడు. ఆ విషయం మీద మంత్రికి సందేహం కలిగింది. “రాజుగారు శివాలయాన్ని అపవిత్రం చేస్తూ మూత్రవిసర్జన చేసినప్పటికీ వజ్రాలు దొరికాయి. నేను భక్తితో ధర్మబద్ధంగా ప్రవర్తించి దూరంగా వెళ్లినా తేలు కాటు వేసింది. దీనిలో న్యాయం ఏంటి?” అనే అయోమయంలో ...

Sirigedoddi Villagers In Anantapur Honour AP Village Volunteer For Selfless Service

Image
5 Jan, 2021 17:38 IST | Sakshi Post N. Rajesh, Village Volunteer, Sirigedoddi Village ANANTAPUR:  The network of village volunteers introduced by Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy in the State to extend the benefits of various schemes to the beneficiaries at their doorsteps has been widely appreciated by everyone. In one such instance, 50 families of a village in Anantapur district felicitated a village volunteer onMonday, for his hard work and effort to ensure that they receive benefits at their doorstep. The incident took place at Sirigedoddi village in Gummaghatta mandal in the district. The family members from the 50 houses in the village got together and honoured Nayakula Rajesh for constantly serving them by observing their needs. Rajesh is working as a Village Volunteer in the Bhutayyadoddi Cluster-7 Division under the Sirigedoddi Grama Secretariat. He ensured that the Government schemes were made available to all those who were eligible in the village ...

ప్రశ్న (జ్యోతిష్య శాస్త్రము)

Image
జ్యోతిష్య శాస్త్రములో  ప్రశ్న  ఒక ప్రత్యేకమైన విభాగం. మనసులో తలచుకొన్న ప్రశ్నలకి, సులభంగా, సమాధానాలు చెప్పే శాస్త్రమే  ప్రశ్న శాస్త్రము . ఆ శాస్త్రంలో  తీసా యంత్రము  చాలా ముఖ్యమైనది. తీసా యంత్రము మార్చు ఈ తీసా యంత్రంలో మూడు భాగాలు ఉన్నాయి. మొదటిది తీసా యంత్రము. రెండవది 30 ప్రశ్న చక్రాలు. చివరిది 30 సమాధాన చక్రాలు. ప్రశ్న చక్రాలు బ్రహ్మ, విష్ణు, మహేష్, హనుమాన్, ఇంకా  పంచ భూతాలు , ద్వాదశ రాశులు,  నవ గ్రహాలు  ఇత్యాది పేర్లతో మొత్తం 30 చక్రాలు ఉన్నాయి.సమాధాన చక్రాలు కూడా అవే పేర్లతో ఒక్కొక్క చక్రంలో 15 సమాధానాలతో నిండి ఉన్నాయి. ఇక నిర్ణాయక యంత్రమైన తీసాలో, నాలుగు నిలువు, నాలుగు అడ్డుగా ఉండే 16 గళ్ళలో అంకెలు మొత్తం కూడితే 30 వచ్చేలాగ ఉంటాయి ! నిజానికి తీసా అంటేనే 30 అని అర్థం ! హిందిలో “తీస్’’ అంటే ముఫ్ఫై అని అందరికీ తెలిసినదే కదా ! అలాగే  సంస్కృతంలో  “త్రింశ’’ అంటే ముఫ్ఫై అని అర్థం .అందుకే ఈ యంత్రాన్ని తీసా  యంత్రము  అని అంటారు. ప్రశ్నలు  మార్చు హనుమాన్ (1 ) నా మనో వాంఛ పూర్తి అవుతుందా లేదా ? అగ్ని (2) నాకు...

ఆంధ్రప్రదేశ్ పురాతన కోటలు

Image
కోటలు ఒక ప్రదేశం యొక్క చరిత్రను ఉత్తమంగా తెలియజేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ను ప్రాచీన కాలంలో వివిధ రాజవంశాలు పాలించాయి. ఆయా వంశాల పాలకులు కాలానుగుణంగా ఈ అందమైన రాష్ట్రానికి అనేక కోటలను అందించారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కోట మరియు కడప జిల్లాలోని గండికోట కోట ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ప్రసిద్ధ కోటలలో కొన్ని. గుర్రంకొండ, కొండపల్లి కోట, కొండవీడు కోట మరియు పెనుకొండ కోట రాష్ట్రంలోని ఇతర ప్రధాన కోటలు. ఇవి కాకుండా, ఈ అందమైన రాష్ట్ర చరిత్రను సుసంపన్నం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ప్రాంతంలో అనేక ఇతర కోటలు ఉన్నాయి. ఈ కోటలన్నీ వాటి కాలానికి చెందిన అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉన్నాయి మరియు పాత కాలపు జ్ఞాపకాలను మన ముందుకు తీసుకువస్తాయి. చంద్రగిరి కోట చరిత్ర  చంద్రగిరిలో ఉన్న ఈ కోట క్రీ.శ. 1000లో 183 మీటర్ల ఎత్తైన కొండపై నిర్మించబడింది. ఈ కోటను మూడు శతాబ్దాల పాటు యాదవరాయలు పాలించారు, ఆ తర్వాత 1367లో విజయనగర రాజుల వశమైంది. విజయనగర పాలకులు కోట విస్తీర్ణాన్ని పెంచి అనేక భవనాలను, దేవాలయాలను నిర్మించారు. చంద్రగిరి కోట సమీపంలోని పర్యాటక ప్రదేశాలు విజయనగర పాలనలో అనేక కావ్యాలు రచించబడ్డాయి. తరువాత ...

వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా బురద రోడ్డుకు స్వంత ఖర్చులతో తాత్కాలిక మరమ్మత్తులు.

Image
గుమ్మఘట్ట మండలం : సిరిగేదొడ్డి -  09/08/2022 మంగళవారం. నా వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఉన్న ట్రాక్టర్ యజమానులు నలుగురితో మాట్లాడి బురదగా మారిన 300 మీటర్ల మట్టి రోడ్డును JCB బాడుగ మరియు ట్రాక్టర్ల డీజిల్ ఖర్చు భరించుకుని దాదాపు 30 ట్రిప్పుల మట్టి మరియు నాలుగు గంటల JCB  పని ద్వారా తాత్కాలికంగా సమస్యకు పరిష్కారం సాధించడం జరిగింది. ట్రాక్టర్ యజమానుల సహకారంతో నేను భరించుకున్న మొత్తం ఖర్చు : 13000/- రూపాయలు. ఇందుకు సహకరించిన భూతయ్యదొడ్డి ట్రాక్టర్ యజమానులు " 1) గాదిరయ్య గారి పెద్ద భీమయ్య కుమారుడు పాలనాయక, 2) గాదిరయ్య గారి అంజినయ్య కుమారుడు రాముడు, 3) బిజికెర ఓబన్న కుమారులు గొడ్లయ్య మరియు క్రిష్ణమూర్తి  4) బాగనపల్లి బోరన్న కుమారుడు పాలయ్య..  వీరందరికీ సిరిగేదొడ్డి గ్రామ ప్రజల తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నాయకుల రాజేష్ - గ్రామ వాలంటీర్,  సిరిగేదొడ్డి గ్రామ సచివాలయం

నా జీవిత ప్రస్థానంలో వార్తాపత్రికల కథనాలు

Image
పేదవారికి చేసే సేవను ‘నారాయణ సేవ’గా అభివర్ణించిన వివేకానందుని లోతైన ఆలోచనను మనమంతా అర్థం చేసుకోవాలని, మందలో ఒకడిగా కాకుండా, వందలో ఒకడిగా ఉంటూ,  వారి బోధనలను యువత నిజజీవితంలో పాటించాలని ఆకాంక్షిస్తున్నాను. మీ.... నాయకుల రాజేష్